Site icon Prime9

Allu Arjun : అల్లు అర్హతో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..

allu-arjun-and-allu-arha-diwali-celebration-video-gone-viral

allu-arjun-and-allu-arha-diwali-celebration-video-gone-viral

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దివాళీ పండుగని చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. శనివారం మావయ్య చిరంజీవి ఇంటిలో బంధువులు, ఇండస్ట్రీ మిత్రులు అయిన మహేష్ నమ్రత దంపతులు, ఎన్టీఆర్ ప్రణతి, వెంకీ మామ, సుధీర్ బాబు, మంచు లక్ష్మి.. ఇలా పలువురితో మరియు తమ కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా దివాళీ సెలబ్రేషన్స్ జరుపుకున్న అల్లు అర్జున్.. ఆదివారం దీపావళి నాడు ఆయన ఇంటిలో కుటుంబసభ్యులు మధ్య జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి . అల్లు అర్జున్ ఆయన ముద్దులు కూతురు కలిసి టపాసులు కలుస్తూ బాగా ఎంజాయ్ చేశారు.

ఇక దివాళీ నాడు కూడా అభిమానులు అల్లు అర్జున్ కి విష్ చేసేందుకు వెళ్లారు. అక్కడ కూతురు అర్హతో తమ అభిమాన హీరో అల్లు అర్జున్ టపాసులు పేలుస్తూ సంతోష పడుతుంటే.. అది చూసిన అభిమానులు మరింత సంబర పడ్డారు. తమ అభిమాన హీరో సంతోషాన్ని అంతా ఒక వీడియోలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కి దివాళీ విషెస్ చెప్పగా.. ఐకాన్ స్టార్ కూడా వారికీ దివాళీ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరి అర్హతో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్ వీడియో వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.

 

ఇక అల్లు అర్జున్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీ గా వున్నారు . చిత్రయూనిట్ వచ్చే సంవత్సరం ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ రీసెంట్ గా ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ పుష్ప 2 నుండి అప్డేట్ ఇచ్చారు.” ఇప్పుడు నేను పుష్ప షూట్ నుంచే వచ్చాను. రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. లాస్ట్ టైం రిలీజ్ చేసిన జాతర పోస్టర్ చూసారు కదా, ఆ జాతర షూట్ జరుగుతుంది. అందుకే చేతులకు ఇంకా నెయిల్ పాలిష్, పసుపు ఉన్నాయి. మీరు ఊహించిన దానికన్నా మించి ఉంటుంది పుష్ప 2. ప్రస్తుతానికి ఇదే అప్డేట్. సినిమా రిలీజయ్యాక మీరే చూస్తారు ” అని చెప్పారు.

Exit mobile version