Site icon Prime9

Allu Arjun : కొత్త స్టూడియోకు శ్రీకారం చుట్టనున్న అల్లు అర్జున్

allu arjun prime9news

allu arjun prime9news

Allu Arjun : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.అలాగే ఆ సినిమా నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.దీనితో మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అల్లు అర్జున్‌కు డిమాండ్ బాగా పెరిగింది.ఐతే తాజాగా అల్లు అర్జున్ గండిపేటలో అల్లు స్టూడియోను నిర్మిస్తున్నారని అనే వార్తా సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది.

అల్లు అర్జున్ హైదరాబాద్‌లో భారీ ఆస్తిని కొనుగోలు చేశారని టాలీవుడలో టాక్ నడుస్తున్నట్టు తెలిసిన సమాచారం.తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద స్టార్ హీరోస్ లో ఒకరైన అల్లు అర్జున్, కొన్ని ఏళ్ళ నుంచి దేశంలో అత్యంత బ్యాంకింగ్ స్టార్‌గా మంచి పేరును సంపాదించుకున్నాడు. పుష్పలో నటిస్తున్న అల్లుఅర్జున్ విలువ రూ. 350 కోట్లు.అల్లు అర్జున్ మరియు అతని కుటుంబం సభ్యులు హైదరాబాద్ మరియు ఇతర నగరాల్లో ఆస్తులను కలిగి ఉన్నారు.

తాజాగా అల్లు అర్జున్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలో అల్లు స్టూడియోను ప్రారంభిస్తున్నట్టు తెలిసిన సమాచారం.హైదరాబాద్‌లోని గండిపేట ప్రాంతంలో ఉన్న అల్లు స్టూడియోస్ అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్యకు అంకితం చేశారు.మొత్తం ఇక్కడ 10 ఎకరాలు ఉండగా.. దీనిలో అల్లు స్టూడియోను నిర్మించాలని, అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version