Site icon Prime9

Adipurush: గ్రాండ్ గా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఎవరొస్తున్నారంటే?

Adipurush

Adipurush

Adipurush: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. దీంతో ఈ వేడుకకు గెస్ట్ గా ఎవరు రానున్నారంటూ రెండు రోజల నుంచి ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచుతూ పోస్టర్లు విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే, తాజాగా సస్పెన్స్ ను రివీల్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరో చెప్పేసింది.

 

భారీగా ఏర్పాట్లు(Adipurush)

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 6 తిరుపతిలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరుగునున్న ఈ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులతో పాటు సినీ సెలెబ్రెటీలు పెద్ద సంఖ్యలో రానున్నారు. కాగా, రామాయణం ఇతివృత్తం తెరకెక్కిన ఈ సినిమా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వహించనున్నట్టు ఏర్పాట్లను బట్టి తెలుస్తోంది. ఈ వేడుక కోసం దాదాపు 200 మంది సింగర్స్, 200 మంది డ్యాన్సర్లు ప్రదర్శన ఇవ్వనున్నారని తెలుస్తోంది.

 

 

భారీ అంచనాలతో..

ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమాకి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కాగా తెలుగులో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసిందే. ఈ చిత్రం జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, హనుమాన్‌గా దేవదత్త నాగే నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

 

 

Exit mobile version