Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’. ఈ మూవీ టికెట్ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఈ మేరకు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ. 50 లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ప్రస్తుతం టికెట్ ధర రూ. 115 ఉంది. దీనికి అదనంగా రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.
పెరిగిన రేట్లు ఇలా..(Adipurush)
అదే విధంగా మల్టీప్లెక్స్‌లో రూ. 177 ఉండగా.. మరో రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు 3డీ గ్లాసులకు ప్రత్యేక్యంగా చెల్లించాల్సి ఉంది. అయితే, ఆదిపురుష్ కు స్పెషల్ షో లకు మాత్రం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికే తెలంగాణలో ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్‌పై రూ. 50 పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే 6 వ షోకూ అనుమతి ఇచ్చింది.
వరల్డ్ వైడ్ గా జూన్ 16న (Adipurush)
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా చేస్తుండగా.. బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. సుమారు 500కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రాముడి కథతో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై ఆసక్తిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి.