Site icon Prime9

Adipurush: ‘ఆదిపురుష్’ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన దేవేంద్ర ఫడ్నవీస్

Adipurush

Adipurush

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్‌’శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులంతా చిత్రబృందానికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  కూడా ‘ఆదిపురుష్‌’ పై ప్రత్యేకంగా ట్వీట్‌ చేశారు.

 

మంచి విజయం సాధించాలి- ఫడ్నవీస్(Adipurush)

సినిమా ట్రైలర్‌ను చూసిన ఆయన.. ‘మర్యాద పురుషోత్తముడు రాముని జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అందరిపై ఆయన దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. ‘ఆదిపురుష్‌’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని దర్శక నిర్మాతలకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు. ఇక పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ‘ఆదిపురుష్‌’ చిత్రానికి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలైన విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెత్‌తో రూపొందిన ‘ఆదిపురుష్‌’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్విటర్‌లో #Adipurush ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. జానకీగా కృతిసనన్‌ , రావణాసురుడు/లంకేశ్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, పాటలు బాగా ఆకట్టుకున్నాయి.

 

 

తెలుగు రాష్ట్రాల్లో ధరల పెంపు(Adipurush)

మరో వైపు ‘ఆదిపురుష్‌’ మూవీ టికెట్‌ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సింగిల్‌ స్క్రీన్‌, మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ. 50 లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు ఉండనున్నాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లో ప్రస్తుతం టికెట్‌ ధర రూ. 115 ఉంది. దీనికి అదనంగా రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా మల్టీప్లెక్స్‌లో రూ. 177 ఉండగా.. మరో రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు 3డీ గ్లాసులకు ప్రత్యేక్యంగా చెల్లించాల్సి ఉంది. అయితే, ఆదిపురుష్ కు స్పెషల్‌ షో లకు మాత్రం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికే తెలంగాణలో ఈ సినిమాకు టికెట్‌ ధరలు పెంచారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్ లో టికెట్‌పై రూ. 50 పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే 6 వ షోకూ అనుమతి ఇచ్చింది.

 

Exit mobile version