Site icon Prime9

Actor Vishal : సర్టిఫికెట్ కోసం ముంబై సెన్సార్ ఆఫీస్ లో రూ. 6.5 లక్షలు లంచం ఇచ్చాను – విశాల్‌

actor vishal video got viral on media about corruption allegations at cbfc

actor vishal video got viral on media about corruption allegations at cbfc

Actor Vishal : సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విశాల్ ఒకరు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. తమిళంతో పాటు ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో కూడా పలు సినిమాలను రిలీజ్ చేసి మంచి హిట్లు అందుకున్నాడు విశాల్. కాగా ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్, ఎస్.జె. సూర్య కలిసి నటించిన సినిమా “మార్క్ ఆంటోని”. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో అభినయ హీరోయిన్ గా నటించగా .. జీవి ప్రకాష్ స్వరాలు సమకూర్చాడు. ఇప్పటికే ఈ మూవీ తెలుగు, తమిళ భాషలలో మంచి టాక్ సంపాదించుకుంది.

అయితే తాజాగా సినిమాలకు సెన్సార్‌ ఇచ్చే సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (Central Board of Film Certification) కార్యాలయంలోనూ అవినీతి పేరుకుపోయిందని విశాల్‌ (Vishal) ఆరోపించారు. తన కొత్త చిత్రం ‘మార్క్‌ ఆంటోని’ విషయంలో ఇదే జరిగిందని జరిగిన విషయం గురించి బయటపెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ.. అవినీతి గురించి తెరపై చూడడం ఓకే గానీ నిజ జీవితంలో జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా ఉంది.. ముంబై సెన్సార్‌ ఆఫీస్‌ లోనూ ఇది జరుగుతోంది. నా Actor Vishal ‘మార్క్‌ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ పనులు పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులకు రూ. 6.5 లక్షలిచ్చా (స్క్రీనింగ్‌ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్‌ కోసం రూ. 3 లక్షలు).

నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. మరో దారిలేక డబ్బులివ్వాల్సి వచ్చింది. నాకే కాదు భవిష్యత్తులో ఏ నిర్మాతకూ ఇలా జరగకూడదు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఈ విధంగా పోయే అవకాశమే లేదు! న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాగా ఎవరెవరికి డబ్బులు పంపించారో వారి పేరు, బ్యాంక్‌ ఖాతా వివరాలనూ పోస్ట్‌లో పెట్టారు.

 

 

దీనిపై కేంద్ర సమాచార శాఖ కూడా X లో స్పందించింది. నటుడు @VishalKOfficial ద్వారా CBFCలో అవినీతికి సంబంధించిన అంశం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదు. ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ నుండి ఒక సీనియర్ అధికారి ముంబైకి పంపబడ్డారు. ఈరోజే విచారణ జరపాలి అని సమాచార శాఖ ట్వీట్‌లో పేర్కొంది.Jsfilms.inb@nic.inలో CBFC ద్వారా వేధింపులకు సంబంధించిన ఏదైనా ఇతర సందర్భాల గురించి సమాచారాన్ని అందించడం ద్వారా మంత్రిత్వ శాఖకు సహకరించాలని మేము ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాము అని తెలిపింది.

 

Exit mobile version