Site icon Prime9

Actor Navdeep : నటుడు నవదీప్‌ కి తెలంగాణ హైకోర్టు షాక్.. పిటిషన్ కొట్టివేత..

actor navdeep petition on madhapur drugs case cancelled by telangana high court

actor navdeep petition on madhapur drugs case cancelled by telangana high court

Actor Navdeep : తెలంగాణ హైకోర్టు డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌ నకు ఊహించని షాకిచ్చింది. మాదాపూర్ ప్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో హీరో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ని 29వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. కాగా ఈ ఆరోపణలను నవదీప్ తోసిపుచ్చుతున్నారు. డ్రగ్స్ కేసు ఎప్పుడూ తెరమీదికి వచ్చినా తన పేరును చేర్చుతున్నారని.. తాను ఎక్కడికి పారిపోలేదని నవదీప్ వ్యాఖ్యానించారు.

ఈ నెల 19వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువు తీరడంతో నిన్న నవదీప్ నివాసంలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో మరో పిటిషన్ ను దాఖలు చేశారు. తాజాగా ఇప్పుడు నవదీప్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 41 ఏ సెక్షన్ కింద నవదీప్ నకు నోటీసు ఇవ్వాలని ఆదేశించింది.

ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను హైకోర్టుకు వినిపించారు. నవదీప్ పై గతంలో కూడ కొన్ని కేసులున్నాయని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనలను నవదీప్ న్యాయవాది తోసిపుచ్చారు. ఆయనను ఏ కేసులోనూ దోషిగా తేలలేదని వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత నవదీప్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ నకు 41 ఏ సెక్షన్ కింద నోటీసు ఇచ్చి విచారణ జరపాలని కోరింది. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version