Site icon Prime9

TS Govt Jobs: తెలంగాణ నిరుద్యోగలకు పండగే.. మరో 16,940 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

telangana govt-to-issue-notifications-for-filling-16940-posts-in-few-days

telangana govt-to-issue-notifications-for-filling-16940-posts-in-few-days

TS Govt Jobs: తెలంగాణలో నిరుద్యోగుల కల సాకారం కానుంది. వరుస పెట్టి నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో తాజాగా మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు సీఎస్‌ సోమేష్‌కుమార్‌ తెలిపారు. ఈ వార్తతో ఉద్యోగ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వివిధ క్యాటగిరీల్లో 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలో ఆదేశాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నాడు సచివాలయం (బీఆర్కే భవన్‌)లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌పై టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ డాక్టర్‌ బి. జనార్ధన్‌రెడ్డితో కలిసి పలుశాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్షించారు.

టీఎస్‌పీఎస్సీ, మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుల ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని ఆయన తెలిపారు. ఈ భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్‌ రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులు పూర్తిచేసి, అవసరమైన అన్ని వివరాలను టీఎస్‌పీఎస్సీకి వెంటనే అందజేస్తే వాటి ఆధారంగా వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీచేస్తుందని సీఎస్ తెలిపారు.

ఇదీ చదవండి: పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. డిసెంబర్ 8 నుంచే ఫిజికల్ టెస్టులు

Exit mobile version