TS EAMCET-2022: తెలంగాణ విద్యార్థులకు గమనిక. ఎంసెట్-2022 స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తమకు సీట్లు రాలేదని బాధపడుతున్న విద్యార్థులు, ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పొందాలనుకునే విద్యార్ధులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసకోవాలని హైయర్ ఎడ్యుకేషన్ సూచించింది.
నేడు అనగా అక్టోబర్ 31న ఇంటర్నల్ స్లయిడింగ్ జరుగుతుందని, నవంబర్ 3 వరకు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగనుందని తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది. ఖాళీగా ఉన్న సీట్లను ముందుగా ఇంటర్నల్ స్లైడింగ్ అభ్యర్ధులకు కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల కింద కేటాయించడం జరుగుతుందని పేర్కొనింది. స్పాట్ అడ్మిషన్ల కోసం వచ్చే అభ్యర్ధులు తప్పనిసరిగా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరుకావల్సి ఉంటుందని వెల్లడించింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని అభ్యర్థులకు అనుమతిలేదని పేర్కొనింది. నిర్ణీత కాలవ్యవధి తర్వాత వారివారి ఒరిజినల్ సర్టిఫికేట్లను తిరిగి ఆయా విద్యార్థులకు అందేస్తామని తెలిపింది. కాగా గత మంగళవారం అనగా అక్టోబర్ 25న ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. దానిలో మొత్తం 79,346 ఇంజినీరింగ్ సీట్లలో 15,447 సీట్లు మిగిలిపోయినట్లు ఉన్నత విద్యామండలి పేర్కొనింది. మరి ఇంకెందుకు ఆలస్యం అర్హత గల విద్యార్థులు వెంటనే స్పాట్ అడ్మిషన్లకు అప్లై చేసుకుండి.
ఇదీ చదవండి:ఆ పీహెచ్‌డీలకు గుర్తింపు లేదు.. వెల్లడించిన యూజీసీ