AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయట్లేదని నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పోస్టుల భర్తీపై స్టే విధించింది.
కాగా తాజాగా హై కోర్ట్ ఆ స్టేను ఎత్తివేసింది. నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనితో రాష్ట్రంలో దాదాపు 560 అంగన్వాడీ సూపర్‌వైజర్ పోస్టులు భర్తీకానున్నాయి. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ వర్కర్లకు విస్తరణ అధికారులుగా పదోన్నతి ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో బుధవారం విచారణ కొనసాగగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీపై స్టే ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే అంగన్‌వాడీ కేంద్రాల్లో 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి ఆమధ్య ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇదీ చదవండి: ఇంటర్ విద్యార్హతతో ఎల్ఐసీలో ఉద్యోగాలు