Site icon Prime9

Indrakeeladri: ఇంద్రకీలాద్రి పై ఈ నెల 26 నుంచి దసరా ఉత్సవాలు

indrakeeladri

indrakeeladri

Vijayawada: ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఈనెల 26 నుంచి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలానక్షత్రం రోజున సీఎం జగన్‌ కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా భక్తులకు అంతరాలయ దర్శనాలు ఉండవని ఈవో భ్రమరాంబ వెల్లడించారు. రూ.100, రూ.300, టికెట్ల దర్శనాలతో పాటుగా, ఉచిత దర్శనాలను భక్తలకు కల్పించనున్న ఆమె తెలిపారు.

దాదాపు 10 లక్షల మందికి పైగా అమ్మవారి దర్శనానికి హాజరవుతారని దేవాదాయ శాఖ అంచనా వేస్తుంది. కాగా దసరా మహోత్సవాలకు టెండర్లు ఇప్పటికే పూర్తయ్యాయని వెల్లడించారు. ఘాట్ రోడ్డులో క్యూలైన్ల ఏర్పాటు పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం పై కమిటీతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా వెల్లడించారు. కుంకుమార్చనలో పాల్గొనే వారికోసం 20 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంచుతామని ఈవో భ్రమరాంబ తెలిపారు. గతంలో మాదిరిగానే వైభవంగా నగరోత్సవం నిర్వహిస్తామని ఈవో పేర్కొన్నారు. భవానీ మాల ధారులు దర్శనాలకు మాత్రమే రావాలని, మాలవితరణకు అవకాశం లేదంటూ ఈవో సూచించారు.

ఇదీ చదవండి: దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్

Exit mobile version