Site icon Prime9

Delhi Crime News: భర్తనే బెదిరించిన భార్య… అత్తమామల ప్రైవేట్ వీడియోలు బయటపెడతానంటూ..!

Delhi crime news

Delhi crime news

Delhi Crime News: వివాహేతర సంబంధాలు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. చిన్నచిన్న మనస్పర్థలే అనేక సమస్యలకు నెలవుగా మారుతున్నాయి. ఈ క్రమంలో ప్రియుడి మోజులో పడిన ఓ ఇళ్లాలు తన ఇంట్లోనే రూ. 2కోట్లను ఊడ్చేసింది. అదీ చాలనట్టుగా అత్తమామల ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ భర్తనే బెదిరించసాగింది. ఈ ఉదంతం ఢిల్లీలో జరిగింది.

ఢిల్లీ లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన నగర వ్యాపారికి గత నాలుగేళ్లుగా భార్యతో మనస్పర్థలు ఉన్నాయి. వారు గత నాలుగేళ్లుగా ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు భర్త గ్రహించాడు. గుట్టుబయటపడడంతో ప్రియుడితో కలిసి పారిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఒకరోజు ప్రియుడితో కలిసి రెండు కోట్ల రూపాయలు విలువైన నగలను కొంత డబ్బును తీసుకుని జంప్ అయ్యింది. దీనిపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా తనపై కేసు నమోదైందని, పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడడం ప్రారంభించింది. కేసును వెనక్కి తీసుకోవాలని లేదంటే అత్తమామలు ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించింది. ఈ విషయాన్ని కూడా బాధితుడు పోలీసులకు తెలిపారు. దానితో పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.

ఇదీ చదవండి: Khammam Crime: లిఫ్ట్ ఇచ్చిన పాపానికి… ఎక్కించుకున్న వ్యక్తినే చంపేశాడు

Exit mobile version