Viral News: పశ్చిమ బెంగాల్‌లోని నిరుపేద కుటుంబానికి చెందిన 16 ఏళ్ల అమ్మాయి స్మార్ట్‌ఫోన్ కొనడానికి తన రక్తాన్ని అమ్మేందుకు సిద్దపడింది.ఈ వింత ఘటన దినాజ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. తపన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్దా ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది.అందరి అమ్మాయి లాగే తాను కూడా ఒక స్మార్ ఫోన్ కొనాలని భావించింది. అనుకున్నట్టుగానే ఆ అమ్మాయి రూ.9000 విలువైన మెుబైల్ ఫోన్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టింది.ఐతే పేద కుటుంబానికి చెందిన ఆమె ఇంత డబ్బు ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం.ఐతే మెుబైల్ ఫోన్ ఆర్డర్ వచ్చేలోపు ఏదో రకంగా డబ్బును ఏర్పాటు చేయాలనుకుంది.దీని కోసం ఆమె తన రక్తాన్ని అమ్మేందుకు సిద్దమైంది.
రక్తాన్ని ఇవ్వడానికి సోమవారం జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు ఆమె వెళ్లింది.అక్కడ ఉన్న అధికారులను కలిసి డబ్బులు ఇస్తేనే రక్తం ఇస్తానని చెప్పింది.దీంతో ఆందోళన చెందిన బ్లడ్ బ్యాంక్ అధికారులు చైల్డ్‌లైన్ ఇండియాకు సమాచారాన్ని అందించారు.జిల్లా శిశు సంక్షేమ కమిటీ సహకారంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఆమెను అప్పగించి కౌన్సెలింగ్ చేశారు.
సోమవారం ప్రవేటుకు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆమె సైకిల్‌ను బస్టాండ్‌లో పెట్టింది.అక్కడ నుంచి జిల్లాకేంద్రమకు 30 కిలోమీట్లర్ల దూరం.అక్కడికి వెళ్లేందుకు తపన్లో బస్సు ఎక్కి ఆస్పత్రికి వెళ్లింది.”ఆమె బయటకు వెళ్ళినప్పుడు నేను ఇంట్లో లేను. డబ్బు సంపాదించడానికి రక్తాన్ని అమ్మవచ్చు అనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చిందో నాకు తెలియదు” అని ఆ అమ్మాయి తండ్రి చెప్పాడు.