Site icon Prime9

Crime News: టీచర్కు పెళ్లి అవుతుందని.. విద్యార్థి ఆత్మహత్య

father committed suicide along with his son in ntr dist

father committed suicide along with his son in ntr dist

Tamil Nadu Crime News: తాను ప్రేమించిన ట్యూషన్ టీచర్కు పెళ్లి కుదరడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని అంబత్తూరులో చోటుచేసుకుంది.

చెన్నై అంబత్తూరుకి చెందిన ప్లస్‌టూ చదువు పూర్తిచేసిన విద్యార్థి(17) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 30వ తేదీన అతడు స్నేహితులతో కలిసి చెన్నై రాజధాని కళాశాలలో కౌన్సెలింగ్‌కి వెళ్లాడు. అనంతరం ఇంటికి వచ్చి గదిలో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దానిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అంబత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అంబత్తూరులోని సర్‌ రామస్వామి ముదలియార్‌ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో ఆ విద్యార్థి చదువు సాగించేవాడు. కాగా అప్పుడు ఆ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ టీచర్ నడుపుతున్న ట్యూషన్‌కు బాలుడు వెళ్లాడు. అయితే ఆ సమయంలో ట్యూషన్ టీచర్ను అతడు ప్రేమించినట్లు సమాచారం. కాగా ఇటీవల ఆమెకు ఇంట్లో వివాహం నిశ్చయించడంతో ఆమె
విద్యార్థితో మాట్లాడడం మానేసింది. దానితో తనను పట్టించుకోవడంలేదనే మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకేముంది దీనితో ఉపాధ్యాయురాలిని మంగళవారం పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది సజీవ దహనం

Exit mobile version