Site icon Prime9

Bihar Road Accident: పాదాచారాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8 మంది దుర్మరణం

six-died-and-15-injured-after-truck-collaided-with-rtc-bus-in-ups-bahraich

six-died-and-15-injured-after-truck-collaided-with-rtc-bus-in-ups-bahraich

Bihar Road Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాదాచారులపైకి ట్రక్కు దూసుకురావటంతో ఆరుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లా దేశారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాజీపూర్-మహనార్ ప్రధాన రహదారిపై ఆదివారం అర్థరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలోకి ఓ ట్రక్కు వేగంగా దూసుకొచ్చింది. రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదాచారులపైకి ట్రక్కు దూసుకెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మృతులను వర్ష కుమారి(8), సురుచి కుమారి (12), అనుష్క కుమారి (8), శివాని (8), ఖుషీ కుమారి (10), చందన్ కుమార్ (20), కోమల్ కుమారి (10), సతీష్ కుమార్ (17) గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో సురుచి కుమారి (8), అంజలి కుమారి (6), సౌరభ్ కుమార్ (17), మరో 50 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరికొందరు ఆస్పత్రిలో గాయాలతో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్‌ కూడా క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ప్రమాదంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పీఎం సహాయ నిధి నుండి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఇదీ చదవండి: పుట్టినరోజు వేడుకలో విషాదం.. 21 మంది సజీవదహనం

Exit mobile version
Skip to toolbar