Site icon Prime9

Kerala: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులంటూ రూ.100 కోట్లు వసూలు చేసిన జంట .. ఈ డబ్బుతో ఏం చేసారో తెలుసా?

kerala

kerala

Kerala: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నామంటూ రూ.100 కోట్ల మేరకు వందలాది మందిని మోసం చేసిన జంటను కొచ్చిలోని త్రిక్కకర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరు విదేశాలనుంచి భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

రూ100 కోట్లు ఎలా వసూలు చేసారు?

కోట్లాది రూపాయల స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి ఎబిన్ వర్గీస్ మరియు అతని భార్య శ్రీరంజిని, వీరువైద్యులు, నటీనటులతో సహా అనేక మంది పెట్టుబడిదారుల నుండి రూ. 100 కోట్ల విలువైన నిధులను పొందారు.  స్టాక్ మార్కెట్ నుండి వారి పెట్టుబడులపై 20-40 శాతం తిరిగి చెల్లిస్తామంటూ వారి వద్దనుంచి వసూలు చేసారు. ఎబిన్, అతని భార్యతో కలిసి దాదాపు 85 మంది ఇన్వెస్టర్లను తమ సంస్థ ద్వారా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం ద్వారా తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తామని వసూళ్లు సాగించారు. ఎబిన్ ఎక్కువగా నటులు, ఎన్నారైలు మరియు నిపుణులను లక్ష్యంగా చేసుకున్నాడు. అతను కేరళ (Kerala) కొచ్చిలోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌తో అంతకుముందు పనిచేసిన సమయంలో కస్టమర్లతో తనకు ఉన్న సంబంధాలను ఈ విధంగా ఉపయోగించుకున్నాడు.

ఇలా బయటపడింది..

పోంజీ స్కీముల్లో పెట్టుబడిదారులు రాబడిని పొందినప్పుడు కొంత కాలం పాటు మంచిగానే ఉంటుంది.

కానీ వారు ఎప్పుడైతే డబ్బు తిరిగి పొందలేరో అపుడు ఖచ్చితంగా అనుమానాలు మొదలవుతాయి.

ఈ కేసులో కూడా అదే జరిగింది. గత నెలలో జరిగిన మోసం వెలుగులోకి రావడంతో వీరిద్దరూ విదేశాలకు పారిపోయారు.

బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వారిని అరెస్టు చేసి గురువారం కొచ్చికి తీసుకొచ్చారు. ఈ జంటపై 120 కేసులు పెట్టగా, ఆరు కేసులు నమోదు చేశారు.

వందలాదిమందినుంచి వసూలు చేసిన డబ్బుతో ఈ దంపతులు విలాసవంతమైన జీవితం గడిపారు. వారు తరచుగా గోవా తదితర ప్రాంతాలకు జూదం ఆడేందుకు వెళ్లినట్లు త్రిక్కకర పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, వారు విదేశాలలో మరియు దేశంలోని పర్యాటక ప్రదేశాలకు ఎక్కువగా వెళ్లినట్లు తెలుస్తోంది. అంటే మందిసొమ్ముతో జల్సాలు చేసారు.. చివరకు పోలీసులకు చిక్కారు.

Janasena Yuvashakthi: ఫస్ట్ టైం.. ఉత్తరాంధ్ర కళాకారులతో కలసి స్టేజిపై డ్యాన్స్ చేసిన పవన్ కళ్యాణ్

AP Highcourt : జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్.. జీవో 1 సస్పెండ్

Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version