Site icon Prime9

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. అల్లూరి జిల్లాలో ఆరుగురు దుర్మణం

six-persons-died-in-road-accident at alluri district

six-persons-died-in-road-accident at alluri district

Road Accident: ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతిచెందారు.

చింతూరు మండలం బొద్దుగూడెం వద్ద జాతీయ రహదారిపై మినీ వ్యాన్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారు ఛతీస్ ఘడ్ నుంచి భద్రాచలం శ్రీరామచంద్రుడిని దర్శించుకోవడానికి కారులో బయలుదేరారు. కాగా ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: 10 గంటల్లో 62 సార్లు.. 162 మంది మృతి

Exit mobile version