Site icon Prime9

Uttar Pradesh: అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు సజీవదహనం

six-of-family-killed-as-fire-breaks-out-at-furniture-shop-in-uttar pradesh

six-of-family-killed-as-fire-breaks-out-at-furniture-shop-in-uttar pradesh

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు.

ఓ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఎలక్ట్రానిక్స్ కమ్ ఫర్నీచర్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్రిప్రమాదం చలరేగింది. ఒక్కసారిగా భవనం మొత్తం అగ్ని కీలలు వ్యాపించడంతో ముగ్గురు పిల్లలు సహా ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు. మొదటి అంతస్తులోని దుకాణం, యజమానుల ఇల్లు దగ్ధమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 18 అగ్నిమాపక దళ వాహనాలు రెండున్నర గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాగా ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రాణనష్టంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Exit mobile version