Site icon Prime9

Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురి మృతి

Road Accident

Road Accident

Road Accident: కృష్ణా జిల్లా పెడన మండలం కృత్తివెన్ను వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొనడంతో ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. కృత్తివెన్ను సీతనపల్లి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఆరుగులు అక్కడికక్కడే చనిపోయారు. పాండిచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌, కృష్ణాజిల్లా బంటుమిల్లి వైపు నుంచి వస్తున్న ఐషర్‌ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. మృతుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. చనిపోయిన వారిలో ఐదుగురు పశ్చిమగోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా చెబుతున్నారు. పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా ప్రమాదానికి గురైన ఒక లారీలో పదిమంది ఉన్నట్టు తెలుస్తోంది .

Exit mobile version