Site icon Prime9

Ragging: ఎంత దారుణం.. బట్టలూడదీసి మరీ ర్యాగింగ్..!

ragging in cmc vellore

ragging in cmc vellore

Ragging: ర్యాగింగ్ అనేది నిషేధం. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటూ ర్యాగింగ్ కు పాల్పడే వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చెయ్యడం, వారిపై కేసులు నమోదు చెయ్యడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. అయినా, కొంత మంది విద్యార్థుల తీరులో మార్పురావడం లేదు. ఇంకా పలు కళాశాలల్లోని జూనియర్ విద్యార్థులను ఈ ర్యాగింగ్ భూతం వెంటాడుతూనే ఉంది. తాజాగా తమిళనాడు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో(సీఎంసీ) సీనియర్లు జూనియర్లతో చాలా దారుణంగా ప్రవర్తించారు.

ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన పని పలువురిని షాక్ కి గురి చేసింది. జూనియర్ విద్యార్థుల బట్టలు విప్పించి.. చెడ్డీలపై క్యాట్ వ్యాక్ చేయించారు సీనియర్లు. అంతటితో ఆగకుండా పైపులతో నీళ్లు చల్లుతూ వారిపై కర్రలు, బెల్టులతో దాడి చేశారు. ఇంకా పైశాచికత్వం పెరిగిపోయి జూనియర్ విద్యార్థులను బురద గుంటలో పడుకోబెట్టడం వారి ప్రైవేట్ పార్ట్స్ పై గట్టిగా కొడుతూ ఎంజాయ్ చేశారు. ఈ హింసకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ర్యాగింగ్ పేరుతో ఆ కళాశాలలోని సీనియర్ల చేసిన వికృత చేష్టలపై దుమారం రేగింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో కాలేజీ యాజమాన్యం సీరియస్ గా స్పందించింది.
ర్యాగింగ్ కు పాల్పడిన ఏడుగురు విద్యార్థులపై వేటు వేసింది. ఇది ర్యాంగింగ్ కాదు పైశాచికత్వం వారిని కఠినంగా శిక్షించాలంటూ బాధితుల తల్లిదండ్రులు మరియు పలువురు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: బిర్యానీ వివాదం.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

Exit mobile version