Chennai: మాయమాటలతో యువకులకు గాలం వేసి పెళ్లాడడం. ఆపై వారి దగ్గరి నుంచి నగదు, నగలతో పరారు కావడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. సీన్ కట్ చేస్తే మంత్రి మా బంధువని కొంతమందిని, పోలీసు శాఖలో పలుకుబడి ఉందని మరికొందరి దగ్గర నమ్మపలికింది. అనంతరం వారికి ఉద్యోగాలిప్పిస్తానని డబ్బు రాబట్టి అక్కడి నుంచి మకాం మార్చేసేది. పోలీస్ కానిస్టేబుల్, ఆటోడ్రైవర్ సహా మరో 3 వ్యక్తులను పెళ్లాడి చివరకి కటకటాలపాలయ్యింది.
నా భర్త పోలీస్ మీకు ఉద్యోగం గ్యారెంటీ..
చెన్నై, కరూరు మారియమ్మన్ కోవిల్ ప్రాంతానికి చెందిన శబరి(28) అనే యువతి. తల్లిదండ్రులతో గొడవపెట్టుకుని రామనాధపురంలోని ఓ ల్యాడ్జీలో ఉండేది. ఆ సమయంలో తనకు రాజేష్ అనే కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడింది దానితో అతనిని వివాహం చేసుకుంది. కొద్ది నెలలపాటు అతనితో కాపురం చేసిన సౌమ్య, తనకు పోలీసు శాఖలో పలుకుబడి ఉందంటూ ఉద్యోగాలిప్పిస్తానంటూ అమయాకులైన యువతీయువకులకు గాలం వేసి వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసి నగలు, నగదుతో అక్కడి నుంచి ఉడాయించింది. ఇదిలా ఉంటే మరల రామనాధపురానికి చెందిన సతీష్ అనే యువకుడిని, కరూరుకు చెందిన ఆటో డ్రైవర్ ఇలా మరో నలుగురిని పెళ్ళి చేసుకుని వారి వద్ద నుంచి కూడా డబ్బును సొమ్మును ఎత్తుకెల్లిపోయింది. ఇలా ఐదుగురిని పెళ్ళి చేసుకుని నాలుగైదు నెలలపాటు వారితో కాపురం చేసి వారిని వదిలి వేరే ప్రాంతంలో నివాసం ఉండేది.
మంత్రి మా బంధువే నేను చూసుకుంటానంటూ..
అయితే కరూరు గాంధీగ్రామం ప్రాంతంలో ఓ ఇంటిలో నివశిస్తూ విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ తన బంధువని చెబుతూ ప్రభుత్వ ఉద్యోగాల పేరిట పలువురి నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసి మోసగించింది. మోసపోయామని తెలుసుకున్న బాధితులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు గురువారం రాత్రి సౌమ్యను అరెస్టు చేశారు. కాగా పోలీసుల విచారణలో ఐదుగురిన పెళ్ళి చేసుకుని వారిని మోసగించిందనే వివరాలు వెల్లడయ్యాయి.
ఇదీ చదవండి: పూడిక తీత తీస్తూ నలుగురు మృతి