Site icon Prime9

Suicide Attempt: పెళ్లింట విషాదం… నవ దంపతుల ఆత్మహత్యాయత్నం

father committed suicide along with his son in ntr dist

father committed suicide along with his son in ntr dist

Suicide Attempt: ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలె పెళ్లి భాజలు మోగిన ఆ ఇంట్లో నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతుంది.

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. పట్టణంలోని రజక కాలనీలో ఉంటున్నచొప్పాల అఖిల, వినయ్ లకు ఇటీవలె వివాహం జరిగింది. గత నెల 31వ తేదీన పెద్దలు వీరిరువురికి పెళ్లి జరిపించారు. కాగా ఏమైందో ఏమోకానీ మంగళవారం రాత్రి ఈ నవదంపతులు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది చూసిన ఇంటి సభ్యులు వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా వధువు అఖిల మృతిచెందింది. వరుడు వినయ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలేంటని ఆరా తియ్యగా అఖిల వినయ్ లు గత కొద్దిరోజులుగా చనువుగా మాట్లాడుకుంటున్నారనే గమనించిన అఖిల తల్లి బలవంతం మేరకే వారిరువురికి పెళ్లి జరిగిందని… కాగా అంతలోనే నవదంపతులు ఇద్దరికి మనస్ఫర్దలు ఏర్పడి ఈ విషయంపై పంచాయితీ కూడా నడుస్తుందని ఈ కారణంతోనే మనస్థాపానికి గురైన వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని స్థానికులు అంటున్నారు.

అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే నిజానిజాలు ఇంకా తెలియరాలేదు. కాగా ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: Fitness Trainer Arrest: తెలుగు నటిపై లైంగిక దాడి.. ఫిట్నెస్ ట్రైనర్ అరెస్ట్

Exit mobile version