Site icon Prime9

Bank Robbery: రూ.12 కోట్లు కొల్లగొట్టిన బ్యాంక్ ఉద్యోగి

bank robbery in thane

bank robbery in thane

Bank Robbery: ఓ బ్యాంకులో సుమారు రూ.12.20 కోట్లకుపైగా నగదు చోరీకి గురయ్యింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని స్పెషల్ ఆపరేషన్ నిర్వహించగా విస్తుపోయే నిజం వెల్లడయ్యింది. ఆఖరికి దొంగని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 9కోట్లకు పైగా నగదును రికవరీ చేశారు. సీన్ కట్ చేస్తే ఆ దొంగ ఎవరో కాదు బ్యాంకు ఉద్యోగే. ఈ చోరీ ఘటన మహారాష్ట్ర థానేలోని మన్ వాడ ఏరియాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో బ్యాంక్లో జరిగింది.

మహారాష్ట్రలోని ముంబ్రా నివాసి అయిన షేక్ అల్తాఫ్ మన్ వాడ ఏరియాలోని ఐసీఐసీఐ బ్యాంకులో కొంతకాలం కస్టోడియన్ గా పనిచేశాడు. అతను బ్యాంకు లాకర్ కీల కేర్ టేకర్ గా విధులు నిర్వహించాడు. అయితే ఆ లాకర్లలో దాచిన డబ్బును కొట్టేసేందుకు ఏడాది నుంచి ప్లాన్ చేశాడు. కాగా పక్కా పథకం ప్రకారం ఈ ఏడాది జులై 12న బ్యాంకులో చోరీకి పాల్పడి అందినకాడికి దోచుకుని పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన స్పెషల్ ఆఫీసర్లు ఎట్టకేలకు దొంగను అరెస్ట్ చేశారు. అయితే ఈ దొంగతనం చేసేందుకు అతనికి మరో ఐదుగురు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా ప్రధాన నిందితుడు అల్తాఫ్ బ్యాంకులో చోరీ పాల్పడడానికి ముందుగా బ్యాంకులోని అలారం సిస్టమ్ ను ఆఫ్ చేసి, సీసీ టీవీని ధ్వంసం చేసిన తర్వాత ఖజానాను తెరిచి నగదును దోచుకెళ్లినట్టు అధికారులు వివరించారు. ఈ చోరీకి అల్తాఫ్ సోదరుడు నీలోఫర్ కూడా సహాయం అందించినట్టు తెలిపారు. అయితే మరుసటి రోజు ఉదయం బ్యాంకు తెరిచి చూసిన అధికారులు డబ్బు మాయమైనట్టు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. థానే,నవీ ముంబై పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి షేక్ అల్తాఫ్ ను అరెస్ట్ చెసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: “జర్నీ” సినిమా తరహా బస్సు ప్రమాదం.. 9 మంది మృతి

Exit mobile version