Site icon Prime9

Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళల మృతి

six-died-and-15-injured-after-truck-collaided-with-rtc-bus-in-ups-bahraich

six-died-and-15-injured-after-truck-collaided-with-rtc-bus-in-ups-bahraich

Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీదర్​లో శుక్రవారం అర్ధరాత్రి ఆటోను ట్రక్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు.

కూలీ పనులు ముగించుకుని మహిళాకూలీలు ఆటోలో తమ ఇళ్లకు వెళ్తుండగా ఘోరప్రమాదం జరిగింది. బీమలఖేడ ప్రభుత్వ స్కూల్​ వద్ద.. ఆటోను ట్రక్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 11 మంది గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

మృతి చెందిన మహిళలను పార్వతి(40), ప్రభావతి(36), గుండమ్మ(60), యాదమ్మ(40), జగ్గమ్మ(34), ఈశ్వరమ్మ(55), రుక్మిణి భాయ్​(60)గా పోలీసు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఎంత ఘోరం.. మందుబాబు ప్రాణం తీసిన “ఆమ్లెట్”

Exit mobile version