Site icon Prime9

Honor Killing: సూట్ కేసులో అమ్మాయి శవం.. కన్నతండ్రే కసాయిగా మారి..!

honor killing dead body in suitecase at uttarpradesh

honor killing dead body in suitcase at uttar pradesh

Honor Killing: అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే తనపాలిట యముడయ్యాడు. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నందుకు కన్నకూతురిని అతి కిరాతంగా హత్య చేశాడు. అంతే కాకుండా తన లిటిల్ ప్రిన్సెస్ మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఓ సూట్ కేసులో కుక్కి యమునా ఎక్స్ ప్రెస్ హైవే వద్ద విసిరేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

పరువు, పరపతి కోసం మానవత్వం మరిచి కన్నపేగునే కడతేర్చుతున్నారు కొందరు దుర్మార్గులు. ఈ తరహా ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఓ తండ్రే తన కుమార్తెను అతి కిరాతకంగా హత్య చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. గత వారం మధురలోని యమునా ఎక్స్ ప్రెస్ హైవే సమీపంలోని సర్వీసు రోడ్డు పక్కన ఓ సూట్ కేసు లభ్యమయ్యింది. అటుగా వెళ్తున్న కొందరు కార్మికులు ఆ సూట్ కేసును గమనించి దగ్గరికి వెళ్లగా, రక్తపు మరకలు ఉండడంతో భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు దానిని తెరచి చూడగా అందులో ఓ అమ్మాయి శవం కనిపించింది. దీనిని హత్య కేసుగా అంచనాకు వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ అమ్మాయి పేరు ఆయుషి చౌదరి కాగా, తండ్రి నితీష్ చేతిలో హత్యకు గురైనట్టు దర్యాప్తులో తేలింది.

అయితే ఆయుషి మరో సామాజిక వర్గానికి చెందిన ఛాత్రపాల్ అనే యువకుడ్ని ప్రేమించి వివాహం చేసుకుందనే కోపంతోనే ఆమె తండ్రి నితీష్ తుపాకీతో తనను కాల్చి చంపారు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా భార్యసాయంతో కుమార్తె మృతదేహాన్ని ఓ సూట్ కేసులో కుక్కి యమునా ఎక్స్ ప్రెస్ హైవే వద్ద విసిరేశారని పోలీసులు పేర్కొన్నారు. సీసీ టీవీ ఫుటేజితో పాటు ఫోన్ డేటాను పరిశీలించి తండ్రి నితీష్ ను హంతకుడిగా నిర్ధారించినట్టు వెల్లడించారు. అతడి వద్ద నుంచి లైసెన్స్ డ్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: యూపీలో మరో శ్రద్దా వాకర్.. ప్రియురాలిని ఆరుముక్కలుగా నరికిన ప్రియుడు

Exit mobile version