Site icon Prime9

Fitness Trainer Arrest: తెలుగు నటిపై లైంగిక దాడి.. ఫిట్నెస్ ట్రైనర్ అరెస్ట్

wife swapping game in Rajasthan

wife swapping game in Rajasthan

Mumbai: సినీ ఇండస్ట్రీలో ప్రేమలు బ్రేక్ అప్ లు కామన్. కానీ అవి కాస్త ముదిరితే కొన్ని విభేదాలకు తావిస్తాయి. కాగా తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ తెలుగు నటి పై ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలో చోటుచేసుకుంది.

టాలీవుడ్‌కు చెందిన ఓ నటిని ఆదిత్య కపూర్‌ అనే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మపలికి, అనంతరం ఆమె పై పలుమార్లు లైంగిక దాడికి ఒడిగట్టాడు. కాగా ఆమె ఒకరోజు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అడగటంతో వేధింపులు మొదలు పెట్టాడు. ఆమెవి ప్రైవేటు ఫొటోలు కొన్ని తన వద్ద ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో బయటపెడతానని బెదిరించసాగాడు. అంతటితో ఆగకుండా ఆమెపై భౌతికదాడి కూడా చేశాడు. దానితో ఆమె ముంబైలోని కూఫీ పరేడ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

దానితో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని పై పలు సెక్షన్ల కింది కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: సోనాలి ఫోగట్ హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు చేయాలన్న గోవా సర్కార్

Exit mobile version
Skip to toolbar