Durga Idols Immersion: దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి.. 15 మంది మృతి

దుర్గా పూజ ఉత్సవం ముగింపు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా దేశ వ్యాప్తంగా దాదాపు 15 మంది మరణించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన దుర్గా మాత ప్రతిమల నిమజ్జన ఉత్సవాల్లో జరిగిన ప్రమాదాల వల్ల పలువురు మరణించారు.

Durga Idols Immersion: దుర్గా పూజ ఉత్సవం ముగింపు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా దేశ వ్యాప్తంగా దాదాపు 15 మంది మరణించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన దుర్గా మాత ప్రతిమల నిమజ్జన ఉత్సవాల్లో జరిగిన ప్రమాదాల వల్ల పలువురు మరణించారు.

తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలందుకున్న దుర్గమాత ప్రతిమలను వైభవంగా దసరా రోజు సాయంత్రం నిమజ్జన కార్యక్రమం చేపడతుంటారు. ఈ నిమజ్జన వేడుకల్లో దాదాపు 15 మంది మృతి చెందారు. కాగా బుధవారం రాత్రి పశ్చిమ బెంగాల్ జల్పాయ్ గురి నగర సమీపంలోని మాల్ నదిలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా వరద వచ్చింది. దీనితో నది తీరంలో నిమజ్జనంలో పాల్గొన్న పలువురు భక్తులు ఈ మెరుపు వరదకు కొట్టుకుపోయారు. అప్రమత్తమైన ఎన్టీఆర్ఎఫ్ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు ఏడుగురి మృతదేహాలను వెలికితీశామని, గాయపడిన 15 మందిని చికిత్స అందిస్తున్నామని జల్పాయ్ గురి జిల్లా మెజిస్ట్రేట్ మౌమిత గోదరా బసు తెలిపారు. నదీ తీరంలో ఉన్న 60 మందిని వరదల బారి నుంచి కాపాడమని ఆమె వెల్లడించారు. భారీవర్షాల వల్ల మాల్ నదిలోకి ఒక్కసారిగా వరద ప్రవాహం రావడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని చెప్తున్నారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో దుర్గా మాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఇద్దరు యువకులు యమునా నదిలో మునిగి మృతి చెందారు. అలాగే రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలోనూ వరదనీటిలో మునిగి ఆరుగురు వ్యక్తులు మరణించారు.

ఇదీ చదవండి: హైదరాబాదులో భారీ వర్షం