Site icon Prime9

Enforcement Directorate: తెరాస ఎంపీ నామా ఆస్తులను జప్తు చేసిన ఈడీ…ఎంతంటే?

ED has seized MP Nama's assets worth Rs 80.65 crore

ED has seized MP Nama's assets worth Rs 80.65 crore

MP Nama Nageswar Rao: దేశ వ్యాప్తంగా వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని రాజకీయ నేతలను ప్రధాని మోదీ ఇబ్బంది పెడుతున్నాడంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న సీఎం కేసిఆర్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన రూ. 80.65 కోట్ల రూపాయలు విలువైన స్ధిర, చర ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.

రాంచి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయంటూ ఈడీ ఎంపీ నామాతోపాటు పలువురు డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. ప్రాజక్ట్ పేరుతో బ్యాంకు నుండి తీసుకొన్న రుణంలో రూ. 361.29 కోట్లను నామా దారి మళ్లించారని ఈడీ అభియోగం మోపింది. ఇప్పటికే హైవే కేసులో రూ. 73.74 కోట్ల విలువుచేసే ఎంపీ ఆస్తులను ఈడీ జప్తు చేసి ఉంది.

తాజాగా మరి కొన్ని నామా ఆస్తులను ఈడీ జప్తు చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మాట్లాడుతున్న నేతలకు అదే చట్టం తన పని తాను చేసుకుంటూ మాట్లాడేవారిని బోర్ల పడేలా చేయడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఎంపీ మాగుంట కుమారుడిని ప్రశ్నిస్తున్న సీబీఐ

Exit mobile version