Site icon Prime9

Nellore: ఘోర అగ్నిప్రమాదం.. టిఫిన్ సెంటర్‌లో పేలిన సిలిండర్లు

cylinders-exploded-in-a-tiffin-center-in-vavilla-nellore district

cylinders-exploded-in-a-tiffin-center-in-vavilla-nellore district

Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వావిళ్లలోని ఓ టిఫిన్​సెంటర్​లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది.

వావిళ్లలోని ఓ హోటల్లో భారీ శబ్దంతో సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. భారీశబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ లో ఎంత మంది ఉన్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మంటలు ఒక్కసారిగా దావానలంలా వ్యాపించడంతో దుకాణంలో ఎంతమంది ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అధికారులకు సమాచారం అదించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో మూడు సిలిండర్లు పేలి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్రిక్తత

Exit mobile version