Hyderabad: నగదు డ్రా చేస్తారు.. ఖాతాదారుడి అకౌంట్ లో కట్ కాదు.. ఎలా సాధ్యమంటే?

ఖాతాదారుడికి విశేష సౌలభ్యాలు అందించాలన్నది బ్యాంకుల ఉద్ధేశం. కాని కొంతమంది సాంకేతికతను తెలివిగా తమకు అనుకూలించుకొని అప్పన్నంగా సొమ్ములు కొట్టేస్తుంటారు. సమయం చూసి దోచేస్తుంటారు.

Fatehnagar: ఖాతాదారుడికి విశేష సౌలభ్యాలు అందించాలన్నది బ్యాంకుల ఉద్ధేశం. కాని కొంతమంది సాంకేతికతను తెలివిగా తమకు అనుకూలించుకొని అప్పన్నంగా సొమ్ములు కొట్టేస్తుంటారు. సమయం చూసి దోచేస్తుంటారు. అయితే హైదరాబాదు పోలీసులు ఊరుకుంటారా! జరుగుతున్న మోసంపై ఓ లుక్ వేశారు.

వివరాల్లోకి వెళ్లితే, ఫతేనగర్ మహేష్ బ్యాంకు సమీపంలోని ఏటీఎం నుండి గత నెల 23న రూ. 7లక్షల రూపాయలు నగదును వివిధ బ్యాంకు డెబిట్ కార్డుల ద్వారా డ్రా చేశారు. అయితే ఆ నగదు ఎవ్వరి ఖాతా నుండి కట్ కాకపోవడాన్ని బ్యాంకు అధికారులు గుర్తించారు. ఏటిఎంలో ఖాతాదారుడు ట్రాన్సాక్షన్‌ చేస్తున్న సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడాన్ని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. దీంతో సనత్ నగర్ పోలీసులకు జరుగుతున్న మోసాన్ని తెలిపారు. అదే విధంగా అక్టోబర్‌ 5న ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఏటీఎం నుంచి రూ. 3.40 లక్షలు విత్‌డ్రా చేశారు. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో ఏటీఎం నుంచి డబ్బులు బయటికి వచ్చినా, ట్రాన్సాక్షన్‌ పూర్తి కానందున ఖాతాలో డెబిట్‌ అయినట్లు చూపించదని పేర్కొన్నారు. పంజాబ్‌, హరియాణా, యూపీలకు చెందిన ముఠాలు ఇలా చేస్తున్నట్లు గుర్తించామని, వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Kadapa SP Anburajan: సెల్ ఫోన్ల కంటైయినర్ దొంగలు అరెస్ట్.. కడప ఎస్పీ అన్బురాజన్