Site icon Prime9

APRO Harassment: మహిళా కళాకారులపై ఏపీఆర్వో వేధింపులు

APRO-harassment-khammam

Khammam: ఖమ్మం జిల్లాలో టీఎస్ఎస్ మహిళా కళాకారులపై ఏపీఆర్వో వేదింపులకు పాల్పడ్డారు. అర్ధనగ్నంగా వీడియో కాల్ చేసి మహిళా కళాకారులపట్ట అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరైనా ప్రశ్నిస్తే కులం పేరుతో దూషించడమే గాక, కలెక్టర్, సమాచార శాఖ కమిషనర్ తనను ఏమీ చేయలేరని బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రశ్నిస్తే కార్యాలయంలోకి రనివ్వొద్దని ఆదేశించడమే కాక, కళాకారుల బైకులు కార్యాలయంలో పెట్టొదని ఏపీఆర్వో ఆర్డర్ వేశాడు.

అంతేకాక సాంస్కృతిక కళాకారుల చేత మూత్రశాలల పక్క గడ్డి పికించి, పేపర్ కట్టలు మోయించడం పనులు చేయించాడు ఆ ఏపీఆర్వో. ఓ మహిళాకు సెలవు ఇవ్వకపోవడంతో ఆమెకు అబార్షన్ అయింది. తాను ముప్పై ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నానని, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని ఏపీఆర్వో శ్రీనివాస్ ఉద్యోగులపై వేదింపులకు పాల్పడుతున్నాడు. దీంతో ఏపీఆర్వో శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని సాంస్కృతిక కళాకారులు కలెక్టర్ గౌతమ్ కు ఫిర్యాదు చేశారు

Exit mobile version