Prime9

Kerala Road Accident: అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా.. 18 మందికి గాయాలు

Kerala Road Accident: అయ్యప్ప దర్శనానికి వెళ్లివస్తోండగా కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వస్తోన్న ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలు అయ్యాయని అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లాలోని లాహా దగ్గర అయ్యప్ప భక్తుల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో పిల్లలు, మహిళలతో పాటు 40 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ వాసులని ఏలూరు నుంచి శబరిమలకు వెళ్లినట్టు అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడగా 6 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు. బాధితులను కొట్టాయంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి సందర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. బాధితులకు అవసరమైన సాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: పుట్టినరోజు వేడుకలో విషాదం.. 21 మంది సజీవదహనం

Exit mobile version
Skip to toolbar