Robbery: ఓ ఎలక్ట్రానిక్ షోరూంకి కన్నమేసిన రూ. 70 లక్షలకు పైగా విలువైన చరవాణీలను చోరీ చేశాడు.. కానీ అక్కడనున్న ల్యాప్‌టాప్‌లు కానీ మరే ఇతర వస్తువుల జోలికి అతను వెళ్లలేదు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ చౌరస్తాలో జరిగింది.
ఈసీఐఎల్ చౌరస్తాలో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ షోరూంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో దొంగతనం జరిగింది. షోరూం మూలన ఉన్న వెంటిలేటర్ ఇనుప చువ్వలు, ఫాల్స్ సీలింగ్ తొలగించి దొంగ లోపలికి ప్రవేశించి.. సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లను కట్ చేశాడు. అనంతరం 200కుపైగా ఐఫోన్, వివో, ఒప్పో, వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లతో అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల జోలికి మాత్రం వెళ్లకపోవడం గమనార్హం.
అయితే నిన్న ఉదయం షోరూం తెరిచిన సిబ్బంది చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి.. సంస్థ జనరల్ మేనేజర్ మహ్మద్ హబీబ్ కు తెలియజేశారు. ఈ మేరకు అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఎలక్ట్రానిక్ షోరూంకు చేరుకుని ఆధారాలు సేకరించాయి. కాగా ఓ సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను బట్టి చూస్తే దొంగతనానికి పాల్పడింది ఒక్క వ్యక్తేనని పోలీసులు వెల్లడించారు. అయితే అతడికి ఇంకెవరైనా సహకరించి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఇది తెలిసినవారి పనేనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: Khammam Injection Murder: ఇంజెక్షన్ హత్య… సూత్రధారి భార్యే… పథకం ప్రకారమే..!