Site icon Prime9

Crime News: అయ్యో చిట్టి తల్లి… కూల్ డ్రింక్ అనుకుని పురుగుల ముందు తాగి..!

5 years old baby girl died after drink pesticides

5 years old baby girl died after drink pesticides

Crime News: బుడిబుడి అడుగుల ఓ ఐదేళ్ల చిన్నారి కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగేసి మృతి చెందింది. ఈ హృదయ విధారక ఘటన కొమురంభీం జిల్లా భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

తెలంగాణ కుమురంభీం  జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్‌కు చెందిన రాజేష్, లావణ్యల ఐదేళ్ల కూతురు శాన్వి. ఈ చిన్నారి గుండి గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. కాగా ఆ చిన్నారి పెద్దనాన్న ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా అక్కడ ఓ కూల్ డ్రింక్ బాటిల్ కనిపించింది. పొలానికి పిచికారీ చెయ్యగా మిగిలిన పురుగుల మందును కూల్ డ్రింక్ బాటిల్లో నింపిపెట్టారు. అది కూల్ డ్రింక్ కాదని తెలియక చిన్నారి శాన్వి తాగేసింది. తీరా తను వాంతులు చేసుకుంటూ ఇంటికి పరిగెత్తగా వాసన గమనించిన శాన్వి తల్లిదండ్రులు సమీప ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శాన్వి మృతి చెందింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూతురిని బతికుంచుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యి చిన్నారి మృతి చెందేసరికి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

ఇదీ చదవండి: Latest Crime News: మహిళ గొంతు కోసిన ఉన్మాది… పెళ్లైందన్నా వినకుండా..!

Exit mobile version