Site icon Prime9

Jodhpur: పెళ్లింట విషాదం.. గ్యాస్‌ సిలిండర్ పేలి ఐదుగురు మృతి

5-dead-over 60- wedding guests injured-in gas -cylinder-blast-in-rajasthan-jodhpur

5-dead-over 60- wedding guests injured-in gas -cylinder-blast-in-rajasthan-jodhpur

Jodhpur: సంతోషంతో కోలాహలంగా ఉండాల్సిన పెళ్లింట విషాదఛాయలు నెలకొన్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో చోటుచేసుకున్నది.

జోధ్‌పూర్‌లోని భుంగ్రా గ్రామంలోని ఓ ఇంట్లో సంతోషంగా అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరుగుతున్నది. ఈ క్రమంలో ఇంటి నిండా జనాలు సందడి వాతావరణం ఉంది. అంతలోనే ఆ ఇంట విషాదం అనుకోని విషాదం నెలకొంది. గురువారం రాత్రి ఆ ఇంటి ప్రమాదవశాత్త సిలిండర్‌ పేలిపోయింది. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఇంటి నిండా మంటలు అంటుకున్నాయి. అంతలోనేగా అవి దావానలంలా ఇంటి మొత్తం వ్యాపించాయి. దానితో అక్కడిక్కడే ఐదుమంది మృతి చెందారు.

గట్టి శబ్ధం రావడంతో చుట్టుపక్కల వాళ్లు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులుకు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దానితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహకారంతో గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారని, వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: ట్రైన్ కు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయి.. 24 గంటలు పోరాడిన యువతి మృతి

Exit mobile version