Site icon Prime9

Hijab: ఇరాన్‌లో హిజాబ్ పై మిన్నంటిన నిరసనలు.. 31 మంది మృతి

30 people were killed in Anti hijab protest in Iran

30 people were killed in Anti hijab protest in Iran

Hijab: ఇటీవల కాలంలో హిజాబ్ ధారణపై భారతదేశంలో నిరసనలు వెల్లువెత్తిన సంగతి విధితమే. కాగా అది కాస్త దేశాలు దాటింది. ఇరాన్‌లోనూ హిజాబ్‌ ధారణకు వ్యతిరేకంగా నిరసన సెగలు వెల్లువెత్తాయి. హిజాబ్‌ ధరించనందుకు మహసా అమిని అనే యువతి ఆ దేశ పోలీసుల దాడిలో గత శనివారం మృతి చెందింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఇరాన్ నిరసనలతో అట్టుడుకుతుంది. అయితే వీటిని అణచివేసేందుకు ఇరాన్‌ భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అణచివేతలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 31 మంది మరణించినట్లు ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్నఎన్జీనో సంస్థ వెల్లడించింది.

కాగా, ఇరాన్ ప్రజలు తమ ప్రాథమిక హక్కులు, గౌరవం కోసం రోడ్లపైకి వచ్చారని.. శాంతియుతంగానే నిరసన చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠినంగా ప్రతిస్పందిస్తోందని ఇరాన్ మానవ హక్కుల (ఐహెచ్‌ఆర్‌) డైరెక్టర్ మహమూద్ అమిరీ-మొగద్దమ్ అన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రముఖ నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. సామాజిక కార్యకర్తలు, నిరసనకారులను పెద్ద సంఖ్యలో పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారని ఈ విషయం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ఉత్తర మజాందరన్ ప్రావిన్స్‌లోని అమోల్ పట్టణంలో నిరసల్లో భాగంగా బుధవారం రాత్రి 11 మంది మరణించగా.. అదే ప్రావిన్స్‌లోని బాబోల్‌లో ఆరుగురు చనిపోయినట్లు తెలిపారు.

మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు హోరత్తడంతో ఇరాన్‌ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుంది. ఓవైపు రోడ్లపైకి వచ్చిన నిరసనలకారులను అణిచివేస్తూనే… మరోవైపు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించింది. తాజాగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ను కూడా బ్లాక్‌ చేసింది. ఇప్పటికే ఇరాన్‌లో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, టెలిగ్రామ్‌, యూట్యూబ్‌, టిక్‌టాక్‌ వంటి సోషల్ మీడియా నెట్ వర్కలను బ్లాక్‌ చేశారు.

ఇదీ చూడండి: Viveka Murder case: వివేకా హత్య పై దర్యాప్తును వేగవంతం చేసిన సీబిఐ

Exit mobile version