Site icon Prime9

Jammu Kashmir: కాశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి

road accident in Jammu kashmir

road accident in Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు.

జమ్మూ-పఠాన్‌కోట్ హైవేపై ప్రమాదం జరిగింది. నానకే చౌక్ వద్ద వేగంగా వెళ్తున్న బస్సును మరో బస్సు ఓవర్‌టేక్ చేయబోయే క్రమంలో రెండు బస్సులు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ ఆమె కూతురు సహా మొత్తం ముగ్గురు మృతిచెందినట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు. పోలీసులు ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక బస్సు సహరన్‌పూర్‌కు వెళ్తుండగా, మరొకటి కథువా జిల్లాకు వెళ్తున్నాయని తెలిపారు. మృతులను పంజాబ్‌లోని బటాలాకు చెందిన మంగి దేవి (36), ఆమె 14 ఏళ్ల కుమార్తె తానియా, రాజ్‌పూర్‌కు చెందిన కస్తూరి లాల్ (58)గా గుర్తించారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.లక్ష, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ఇవ్వనున్నట్టు సాంబా జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అలాగే స్వల్ప గాయాలకు రూ.10,000. పరిష్కారాన్ని ప్రకటించారు.

ఇకపోతే ఈ ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. దోడా, సాంబాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగడం బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, ఆయా జిల్లాల అధికారులు బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఆయన ట్వీట్‌లో తెలిపారు.

ఇదీ చదవండి: బిర్యానీ వివాదం.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

Exit mobile version