Site icon Prime9

Crime News: 12 ఏళ్ల బాలుడిపై గ్యాంగ్ రేప్.. ప్రైవేట్ పార్ట్స్ లోకి రాడ్డు చొప్పించి మరీ..!

4 girls gang raped a boy in jalandhar

4 girls gang raped a boy in jalandhar

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడి పై ముగ్గురు స్నేహితులు గ్యాంగ్ రేప్ కి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోతోంది అంటూ స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొన ఊపిరితో ఉన్న బాధిత బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో సెప్టెంబర్ 18 న జరిగిన ఓ దారుణ ఘటన తాజాగా వెలుగుచూసింది. ఓ 12ఏళ్ల బాలుడిపై అతని బంధువు సహా ముగ్గురు మైనర్ స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా అతని ప్రైవేట్ అవయవాల్లో రాడ్డు చొప్పించి బాలుడిని తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆ చిన్నారిని కర్రలతో అత్యంత దారుణంగా కొట్టి అక్కడిని పరారయ్యారు. కొన ఊపిరితో పడి ఉన్న బాలుడిని అతని తల్లిదండ్రులు ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేర్పించారు. కాగా అతనికి వైద్యం నిర్వహిస్తున్న వైద్యులు అసలు విషయం తెలుసుకున్ని నివ్వెరపోయారు. ఈ నెల 22న ఈ విషయం పై డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. దానితో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. నిందితులంతా మైనర్లని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వారిలో ఒకరిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచామని డీసీసీ తెలిపారు. కాగా విషయం తెలిసిన వెంటనే బాధితుని తల్లిదండ్రులను పోలీసు బృందం కలుసుకుందని కానీ వారు వివరాలు చెప్పేందుకు నిరాకరించారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ సైన్ తెలిపారు.

ఈ ఘటన పై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. అమ్మాయిల సంగతి పక్కనపెట్టండి, ఢిల్లీలో కనీసం అబ్బాయిలకు కూడా భద్రత లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పై తమకు కేసు అందిందని, ఇప్పటివరకు తీసుకున్న చర్యల పై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను ఆమె కోరారు.

ఇదీ చదవండి:  జహీరాబాద్లో వివాహితపై గ్యాంగ్ రేప్

Exit mobile version