Site icon Prime9

Twitter: ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాక్.. 4400 మంది తొలగింపు

1200-employees-resigns-to-twitter

1200-employees-resigns-to-twitter

Twitter: కొత్త యజమాని ఎలాన్ మస్క్‌ నేతృత్వంలో ట్విటర్‌లో భారీ మార్పులు చేర్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సంస్థలో పనిచేసే చాలా మంది ఉద్యోగస్థులు తమ ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు ఊడిపోతాయో అంటూ బిక్కుబిక్కున విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మరో సారి 4400 మంది ఉద్యోగులు లేఆఫ్‌కు గురయ్యారు.

ట్విట్టర్ ను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే ఆ సంస్థలోని దాదాపు సగం మంది ఉద్యోగులను మస్క్‌ తీసేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్లోని ఔట్‌ సోర్సింగ్‌ విభాగంలోనూ మస్క్ కోతలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో దాదాపు 5500 మంది కాంట్రాక్టు ఉద్యోగులుండగా వారిలో 4400 మందిని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇంటికి పంపించినట్లు సమాచారం. ట్విటర్‌కు చెందిన కంటెంట్‌ మాడరేషన్, రియల్‌ ఎస్టేట్‌, మార్కెటింగ్, ఇంజినీరింగ్‌, ఇతర విభాగాల్లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల నుంచి తీసేశారు. ఇ-మెయిల్‌ ద్వారా కాంట్రాక్టర్లకు ఈ సమాచారం అందిచారు. అయితే తాజా కోతలపై ట్విటర్‌ నుంచి గానీ, ఎలాన్ మస్క్‌ నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇదీ చదవండి: ట్విటర్‌లో “బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్” నిలిపివేత.. అఫీసియల్ వచ్చింది

 

Exit mobile version