Bisleri: ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ ‘బిస్లరీ’ని అమ్మకానికి పెట్టినట్టు ఆ సంస్థ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడించారు. బిస్లరీ అమ్మకానికి సంబంధించి ఇప్పటికే పలు సంస్థలతో చర్చలు జరపుతున్నామని ఆయన తెలిపారు. ఈ సంస్థల్లో టాటా గ్రూప్ కూడా ఉందని వెల్లడించారు. టాటా కన్జ్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ సంస్థతో ఇప్పటికే రూ. 7 వేల కోట్లకు డీల్ పూర్తయిందని వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. తాము ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అమ్మకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేనని తెలిపారు.
తనకు వృద్దాప్యం వచ్చేస్తుందని తన వ్యాపారాన్ని ఎవరో ఒకరు చూసుకోవాల్సి ఉంటుందని కాగా తన కూతురు జయంతికి బిజినెస్ హ్యాండిల్ చేయడం ఇష్టం లేదని 82 ఏళ్ల చౌహాన్ తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు 2016లో చౌహాన్ మరోసారి సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్ లోకి దిగారు. ‘బిస్లరీ పీఓపీ’ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి అడుగుపెట్టారు. అయితే, గతంలో మాదిరిగా ఆయన ఈ బిజినెస్ లో విజయం సాధించలేకపోయారు.
ఇదీ చదవండి: 6,000 మంది ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతున్న HP