Elon Musk: సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ అయిన ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ సంచలన నిర్ణయాలు, మైక్రోబ్లాగింగ్ యాప్ లో తనదైన స్టైల్‌లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇటీవల కాలంలో ఈ కంపెనీలో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తులను తొలగించిన సంగతి తెలిసిందే. మరియు వీలైనంత వరకూ ట్విట్టర్లో మ్యాన్ పవర్‌ను తగ్గించే పనిలో పడ్డారట. అయితే తాజాగా మస్క్ మరో కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ ఎకౌంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో పలు మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. “వెరిఫికేషన్ ప్రాసెస్‌లో భారీ మార్పులు చేయనున్నాను” అని ఆయన ట్వీట్ కూడా చేశారు. ఎలాంటి మార్పులు అన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
బ్లూ టిక్ కూ డబ్బులు కట్టాలి
కొన్ని మీడియా కథనాల ప్రకారం ట్విటర్ అకౌంట్ వెరిఫికేషన్ చేసి బ్లూ టిక్ ఇవ్వడానికి ట్విటర్ ఇక నుంచి డబ్బులు వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. కొన్ని రిపోర్టుల అంచనాల ప్రకారం ట్విట్టర్ వెరిఫైడ్ యూజర్స్ బ్లూ టిక్‌ను అలాగే మెయింటేన్ చేసేందుకు నెలకు 4.99 డాలర్లు అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.415 ను ట్విటర్‌కు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎలన్ మస్క్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఇదే కాకుండా ఆయన “Content Moderation Policy”పైనా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ట్విటర్ వేదికగా మస్క్ ఓ విషయం స్పష్టం చేశారు. ప్రత్యేకంగా కంటెంట్ మోడరేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
To be super clear, we have not yet made any changes to Twitter’s content moderation policies https://t.co/k4guTsXOIu
— Elon Musk (@elonmusk) October 29, 2022
ట్వీట్ అక్షర పరిమితి పెంపు
అంతేకాకుండా ట్విట్టర్ లో చేసే ట్వీట్లకు ఇప్పటివరకు అక్షర పరిమితి ఉంది. 280 అక్షరాలకు మించి ఒక ట్వీట్ లో రాయలేము. అయితే దీనిని భవిష్యత్తులో తొలగించే యోచనలో మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్షర పరిమితులను వదిలించుకోగలమా లేదా దానిని విస్తరించగలమా అని ఓ వినియోగదారుడు చేసిన ట్వీట్ కు స్పందించిన ఎలన్ మస్క్ కచ్చితంగా అంటూ రీ ట్వీట్ చేశాడు. అంటే రానున్న రోజుల్లో ట్వీట్లలో అక్షర పరిమితి తొలగిపోనుందనే చర్చ ఇప్పుడు జోరుగా వినిపిస్తుంది. మొదట్లో ఒక్కో ట్వీట్ అక్షరపరిమితి 140 అక్షరాలు ఉండేది. కాగా దానిని 2017లో 280కి పెంచింది. మరి రానున్న రోజుల్లో ఎలన్ మస్క్ అక్షర పరిమితిపై మరియు ట్విట్టర్ లోనూ ఎలాంటి మార్పులు, నిర్ణయాలు సర్వత్రా ఆసక్తిగా మారింది.
Absolutely
— Elon Musk (@elonmusk) October 30, 2022
ఇదీ చదవండి: ట్విట్టర్ కు పోటీగా “బ్లూస్కై”.. ట్విట్టర్ మాజీ సీఈవో డోర్సే కొత్త యాప్