Site icon Prime9

Koo: బ్రిజిల్లోనూ కూతపెడుతున్న “కూ” యాప్.. 48 గంటల్లో 1 మిలియన్ డౌన్లోడ్స్

Koo garners 1 million downloads in Brazil after launch 48 hours

Koo garners 1 million downloads in Brazil after launch 48 hours

Koo: దేశీయ ట్విట్టర్ గా పేరుగాంచిన కూ యాప్ ఇప్పుడు విదేశాల్లోనూ మంచి పాపులారిటీ సాధిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి ఉదాహరణగా భారతీయ బహుభాషా మైక్రోబ్లాగింగ్ మరియు సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ కూ ఇటీవలే బ్రెజిల్‌లో ప్రారంభించబడింది. కూ ప్లాట్‌ఫారమ్ పోర్చుగీస్‌కు భాషలో అందుబాటులోకి వచ్చింది. ఇది అక్కడ 11 స్థానిక భాషలలో అందుబాటులోకి వచ్చింది. బ్రెజిల్‌లో ప్రారంభించిన 48 గంటల్లో, యాప్ 1 మిలియన్ యూజర్ డౌన్‌లోడ్‌లు, 2 మిలియన్ కూస్ మరియు 10 మిలియన్ లైక్‌లను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ #1 స్థానంలో ఉంది.

దీనిపై కూ సహ వ్యావస్థాపకుడు మయాంక్ బిదావత్కా సంతోషం వ్యక్తం చేశారు. “గత 48 గంటల్లో బ్రెజిల్ నుండి మిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు కూలో చేరారు. బ్రెజిల్ సోషల్ మీడియాలో స్థానిక భాషతో అందుబాటులో ఉండే యాప్ లలో కూ యాప్ కు అతిపెద్ద యూజర్ ఎంగేజ్ మెంట్ ఉందని ఆయన పేర్కొన్నారు. కూ బ్రెజిల్‌లో కల్ట్ బ్రాండ్‌గా మారిందని నమ్మశక్యం కాని అభిమానుల ఫాలోయింగ్‌ను కలిగి ఉందని తెలిపారు. టెక్ ఉత్పత్తుల ప్రపంచంలో ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ ఉద్యమాన్ని ప్రారంభించినందుకు మేము గర్విస్తున్నాము బిదావత్కా వెల్లడించారు.
ప్రతి కొత్త భాష మరియు దేశం ప్రారంభించినప్పుడు, మేము భాష-అవరోధాలను అధిగమించి ప్రపంచాన్ని ఏకం చేయాలనే మా మిషన్‌కు కూ
మరింత దగ్గరవుతుంది” అని మయాంక్ బిదావత్కా అధికారిక ప్రకటనలో తెలిపారు.

భారతదేశంలోని బెంగుళూరు కేంద్రంగా కూ మైక్రోబ్లాగింగ్ యాప్ కన్నడ భాషలో 2020లో ప్రారంభించబడింది. ఆ తరువాత ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, అస్సామీ, మరాఠీ, బంగ్లా, గుజరాతీ, పంజాబీ మరియు భాషలను యాప్ లో అందుబాటులోకి తెచ్చింది. బహుభాషా మైక్రోబ్లాగింగ్‌గా బలమైన పునాదిని ఏర్పరుచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు చేరుకోవాలనే లక్ష్యంగా కూ పనిచేస్తుంది. సమాచారం ప్రకారం, త్వరలో కూ అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, కొరియన్, జపనీస్ మరియు ఇతర భాషలతో సహా మరిన్ని విదేశీ స్థానిక భాషలకు సైతం విస్తరించనుంది. రప్రస్తుతం ట్విట్టర్‌లో నెలకొన్న గందరగోళాల మధ్య, అతిపెద్ద బహుళ-భాషా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌గా కూ యాప్ క్రమంగా వృద్ధిని సాధిస్తోంది.

ఇదీ చదవండి: ట్విట్టర్ మాజీ ఉద్యోగులకు ‘కూ’ పిలుపు

Exit mobile version