5G Services: మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. అక్టోబరు1 నుంచి దేశంలోని 13 ప్రధాన పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన సేవల లభ్యత గురించి ప్రగతి మైదాన్‌లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ ప్రకటించనున్నారు.
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాతో సహా టాప్ టెలికాం ప్రొవైడర్లు 5G ప్లాన్‌లను వివరించనున్నాయి. దీనికిగానూ నాలుగు రోజుల సమావేశాన్ని వచ్చే నెలలో ప్రధాని ప్రారంభిస్తారు. అంతకుముందే ఈ హై-స్పీడ్ 5Gఇంటర్నెట్ రోల్ అవుట్ యొక్క మొదటి వేవ్ అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై మరియు పూణేలలో జరుగుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ 5జీ సేవలపై ప్రజల్లో అనేక భయాలు నెలకొని ఉన్నాయి. దీని ద్వారా వచ్చే రేషయేషన్ వల్ల అనేక వ్యాధులు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు.
అయితే దీనికి సంబంధించి గతవారం కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రజల్లోని ఆ అభద్రతాభావాన్ని తొలగించారు. 5G యొక్క రేడియేషన్ ప్రభావాల గురించి ఎవరూ ఆందోళనల చెందవద్దని సూచించారు. 5G నుండి వచ్చే రేడియేషన్ WHO సిఫార్సు చేసిన దానికంటే చాలా తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రజలు ఈ 5జీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి: Xiaomi వారు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే!