Amazon: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ 10,000 మందిని ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం. కార్పొరేట్, టెక్నాలజీ ఉద్యోగులను ఈ వారం నుంచే తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టడాన్ని ఆపేసినట్లు, గతవారం అమెజాన్ ఓ ఉన్నతాధికారికి పంపిన అంతర్గత మెమో ద్వారా తెలిపింది.
అమెజాన్ రోబోటిక్స్ బృందంలో పనిచేస్తున్న వారికి పింక్ స్లిప్ (తొలగింపు లేఖ)లు ఇచ్చారని ఆ అధికారి చెప్పారు. అమెజాన్ రోబోటిక్స్ విభాగంలో 3,766 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎంత మందిని ఇంటికి పంపించారనే వివరాలు మాత్రం తెలియరాలేదు. లాభదాయకత లేని కొన్ని విభాగాల్లోని ఉద్యోగులను కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సిందిగా అమెజాన్ సూచించినట్లు, ‘లక్ష్యిత’ ప్రాజెక్టుల్లో మాత్రం కొత్త నియామకాల ప్రక్రియను అమెజాన్ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: సత్తా చాటిన జియో.. మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్ గా గుర్తింపు