YCP Leader Murder: అధికార పార్టీ నేతల వరుస హత్యలు ఏపీలో కలవరం పుట్టిస్తున్నాయి. ఇటీవల ఏలూరులో వైసీపీ నేత గంజి ప్రసాద్ దారుణ హత్య మరువకముందే అదే తరహాలో ప్రకాశం జిల్లాలో మరో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై ఓ వైసీపీ నేతను లారీతో ఢీకొట్టి అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాలోని మూలగుంటపాడు గ్రామానికి చెందిన పసుపులేటి రవితేజ (32) అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువనేతగా పనిచేస్తున్నారు.
మరియు అక్కడ స్థానికంగా ఇసుక వ్యాపారం కూడా చేస్తుంటాడు. రవితేజ తండ్రి శ్రీనివాసరావు సోమరాజుపల్లి మాజీ సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహించారు.
రవితేజ, తన స్నేహితుడు ఉమ వేర్వేరు బైకులపై గురువారం రాత్రి కనుమళ్లకు బయలుదేరగా.. ఈ క్రమంలో రాత్రి 9 గంటల సమయంలో వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ రవితేజ బైక్ ను ఢీకొట్టింది. దానితో అతడు రోడ్డు మీద పడిపోయాడు. అంతటితో ఆగక పడిపోయిన వ్యక్తి పైనుంచి లారీ ఎక్కించడం వల్ల రవితేజ అక్కడికక్కడే మృతిచెందాడు.
మరో బైక్ మీద రవితేజ వెంటే వెళ్తున్న అతడి ఫ్రెండ్ ఉమ ఇది గమనించి లారీని ఛేజ్ చేసేందుకు ప్రయత్నించాడు కానీ అతడిని కూడా చంపేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించగా అతడు తప్పించుకున్నాడు. కాగా ఈ హత్య పాతకక్షల నేపథ్యంలోనే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. సింగరాయకొండ మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవి విషయంలో ఓ ఎంపీటీ సభ్యుడికి రవితేజకు నెలకొన్న వివాదమే వివాదమే రవితేజ హత్యకు దారి తీసిందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనతో మాలగుంటపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పార్టీలోని మరో వర్గంవారే ఈ హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలతో గ్రామంలో పికెట్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. కాగా రవితేజకు భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. రవితేజ మరణంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇదీ చదవండి: Hijab: ఇరాన్‌లో హిజాబ్ పై మిన్నంటిన నిరసనలు.. 31 మంది మృతి