Site icon Prime9

Shocking Death: ఆసుపత్రిలో అనూహ్య మరణం… పరామర్శకు వచ్చి తిరిగిరాని లోకాలకు…!

shocking death in Khammam

shocking death in Khammam

Shocking Death: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రవేట్ ఆసుపత్రిలో మహిళ అనుహ్యరీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచింది.

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రవేట్ ఆసుపత్రిలో ఓ మహిళ అనుహ్యరీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది.
ఆసుపత్రిలో ఉన్న లిఫ్టు రాకముందే.. అకస్మాత్తుగా డోర్ తెరుచుకుంది. అదే సమయంలో ఫోన్‌ మాట్లాడుతూ లిఫ్ట్ రాలేదని గుర్తించని మహిళ.. లోపలికి అడుగు వేయడంతో అమాంతం లిఫ్ట్‌ గుంతలో పడి పోయింది. దీనితో పైనుంచి వచ్చిన లిఫ్ట్ ఆమెపై పడి తీవ్రగాయాలైన ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందంది.

మృతురాలిని ఖమ్మం జిల్లాలోని వైరా మండలం గొల్లెనపహాడ్‌కు చెందిన ప్రమీలగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆమె.. తిరిగి వెళ్తుతూ లిఫ్ట్‌ గుంతలో పడి ప్రాణాలు విడిచింది. లిఫ్ట్‌ రాకముందే డోర్‌ ఓపెన్ అయ్యిందంటే పూర్తిగా మెయింటినెన్స్‌ లోపంతోనే జరిగినట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎలాంటి కేసు నమోదు కాలేదు.

ఇదీ చదవండి: Road Accident In Delhi: ఘోర రోడ్డు ప్రమాదం… నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్

Exit mobile version