Visakha Express Train: విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు దగ్గర రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు విడిపోయాయి. ఒక్కసారిగా బోగీలు రైలు నుంచి వేరవ్వడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్టేషన్ లో రైలు నెమ్మదిగా ఆగే సమయంలోనే లింక్ తప్పడంతో ప్రాణనష్టం జరగలేదు. బోగీల్లోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
ఏలూరు రైల్వేస్టేషన్ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. శిరిడీ నుంచి వస్తున్న శిరిడీ ఎక్స్ ప్రెస్ విశాఖ వెళ్లాల్సి ఉండగా అటుగా స్టేషన్ కు వెళ్తున్న విశాఖ ఎక్స్ ప్రెస్ బాగా స్లో అయ్యింది. సరిగ్గా అదే సమయంలో రైలు బోగీల యొక్క లింక్ ఊడిపోయింది. దానితో మూడు బోగీలు (ఎస్1,ఎస్2,ఎస్3) రన్నింగ్ ట్రైన్ నుంచి విడిపోయాయి. అయితే ట్రైన్ చాలా నెమ్మదిగా వెళ్తున్న సమయంలో రైలు లింక్ ఊడిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.
రైలు కొంత వేగంతో వెళ్తున్న సమయంలో కనుక లింక్ ఊడిపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. కాగా ప్రమాదమేమీ జరగకపోవటంతో అటు ప్రయాణికులు, ఇటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే విశాఖ వెళ్లాల్సిన రైలు ఏలూరు రైల్వేస్టేషన్ లోనే రెండు గంటల పాటు ఉండిపోవాల్సి వచ్చింది.
విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. లింక్ తెగిన చోట మరమ్మతులు చేపట్టారు. తిరిగి బోగీలను ట్రైన్ కు జోడించడంతో రైలు ముందుకు కదిలింది.
ఇదీ చదవండి: Ap Intermediate Board: విద్యార్థిని చితకబాదిన లెక్చరర్… రంగంలోకి దిగిన ఇంటర్మీడియట్ బోర్డ్