Site icon Prime9

Surrogacy: సరోగసి వివాదం.. విఘ్నేశ్ ఆసక్తికర పోస్ట్

tamilnadu govt report on nayan surrogacy

tamilnadu govt report on nayan surrogacy

Surrogacy: నయనతారా, విఘ్నేశ్ శివన్ దంపతుల సరోగసి అంశంపై గత మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో తీవ్ర రచ్చ కొనసాగుతుంది. ఎందుకంటే పెళ్లైన 4 నెలలకే నయన్‌, విఘ్నేశ్‌ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులమయ్యామంటూ నెట్టింట పోస్ట్ చేశారు. దానితో ఈ వార్త తీవ్ర చర్చనీయాంసంగా మారింది. సరోగసి ద్వారానే ఈ జంట తల్లిదండ్రులయ్యారనే వార్తలు రావడంతో తీవ్ర దూమారం రేగింది. ఈ క్రమంలో విఘ్నేశ్‌ ఇన్‌స్టా స్టోరీస్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

‘‘అన్ని విషయాలు మీకు సరైన టైంలో తెలుస్తాయి. అప్పటివరకూ ఓపికతో ఉండండి. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి’’ అని విఘ్నేశ్ పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు విఘ్నేశ్ ఇన్ డైరెక్ట్ గా సరోగసిపై స్పందించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. నయన్ విఘ్నేశ్ సరోగసి వార్తలు తెరపైకి రావడంతో తమిళనాడు ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. నిబంధనల ప్రకారమే వీరు సరోగసి ద్వారా సంతానాన్ని పొందారా? లేదా? అనే విషయంపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్‌ విచారణకు ఆదేశించారు. సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్‌ లో వివాహంతో ఒక్కటయ్యారు.

ఇదీ చదవండి: నయనతార సరోగసీపై వివరణ కోరతాం.. తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్

Exit mobile version