Site icon Prime9

Unstoppable Season 2: మరింత రంజుగా అన్‌స్టాపబుల్‌-2 ట్రైలర్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..!

unstoppable season 2 trailer out

unstoppable season 2 trailer out

Unstoppable Season 2: కథానాయకుడిగానే కాకుండా హోస్ట్‏గానూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో నటిసింహం బాలకృష్ణకు సాటిలేరు. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే షో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ మాస్ యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోగా ఉన్న బాలయ్యలోని మరోకోణాన్ని ఈ షోతో పరిచయం చేశారు. కాగా తనదైన స్టైల్‏తో యాంకరింగ్‏కు కొత్త రూపును ఆపాదించారు బాలయ్య. కాగా ఇప్పుడు అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 రాబోతున్న విజయం విదితమే కాగా ఇటీవల ఈ షోకు సంబంధించిన టీజర్కు సైతం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే తాజాగా నేడు ఈషో ట్రైలర్ను రిలీజ్ చేసింది ఆహా. అక్టోబర్ 14 నుంచి ప్రతి శుక్రవారం అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2 స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.

ఇక ఈ ట్రైలర్‏లో బాలయ్య లుక్ మాత్రం సూపరో సూపర్ అని చెప్పాలి. నిధిని అన్వేషిస్తూ గుహలోకి వెళ్లిన బాలయ్య అక్కడ ఎన్నో సవాళ్లు, అడ్డంకులు ఎదుర్కొని, చివరకు నిధిని చేరుకుంటారు. అక్కడ ఉన్న ఖజానాను ఓపెన్ చేయగానే అందులో ఓ ఖడ్గం లభిస్తుంది. అది చేతపట్టుకుని మంచి పవర్ ప్యాక్ డైలాగ్ను చెప్తారు. “గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్‌” ప్రశ్నల్లో మరింత ఫైర్.. ఆటల్లో మరింత డేర్.. సరదాల్లో మరింత సెటైర్.. ఈసారి మీకోసం మరింత రంజుగా అంటూ చెప్పుకొచ్చారు బాలకృష్ణ. అయితే ఈ ట్రైలర్‏తో షోపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

ఇదిలా ఉంటే మరోవైపు అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2 మొదటి అతిథిగా మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు రానున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా మొదటిసారిగా చంద్రబాబు ఒక టాక్ షోకు రానుండడంతో అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2 కోసం ఫ్యాన్స్ క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు.
Unstoppable with NBK Season 2 Trailer | #NandamuriBalaKrishna | Prashanth Varma | ahaVideoIN

ఇదీ చదవండి: మీడియాపై చిరంజీవి ఆగ్రహం..!

Exit mobile version
Skip to toolbar