Site icon Prime9

Fire Accident: టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

fire accident in crackers shop at Vijayawada

fire accident in crackers shop at Vijayawada

Fire Accident:  దీపావళి పండుగ వేళ విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. టాపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం జరగడం వల్ల ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. దీపావళి సందర్భంగా విజయవాడ నగరంలోని గాంధీనగర్‌ జింఖానా గ్రౌండ్‌లో టపాసుల స్టాల్స్ ఏర్పాటు చేశారు. కాగా ఆదివారం ఉదయం ఓ దుకాణంలో ఓ పటాకీ పేలింది. దీనితో ఆ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కొక్కటిగా దుకాణంలో ఉన్న అన్ని టపాసులు పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడి పక్కనే ఉన్న రెండు దుకాణాలకు వ్యాపించాయి. ఈ భారీగా ఎససిపడిన మంటలు ధాటికి మూడు దుకాణాలు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా అప్పటికే జరాగాల్సి ప్రమాదం జరిగిపోయింది పటాకుల దుకాణంలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పలాసలో సైకో వీరంగం.. వృద్ధుడి తల పగులగొట్టిన వైనం!

Exit mobile version